
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులు నాలుగు రోజులు సామూహిక సెలవు ప్రకటించారు. నాన్నూర్ పంచాయతీ కార్యదర్శి దినేష్ సస్పెన్షన్ నిరసనగా బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో శ్రీనివాస్ కు మండల పంచాయతీ కార్యదర్శులు నాలుగు రోజులపాటు సామూహిక సెలవు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ .. ప్రత్యేక అధికారుల పాలన ఫిబ్రవరి నుండి ఎస్ఎఫ్సి, పిఎఫ్ఎంఎస్ నిధులు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రాకపోవడంతో పంచాయతీలో చేయవలసిన పనులు కొంటూబడడంతో పంచామతీ కార్యదర్శల స్వంత డబ్బులతో పనిచేస్తూ గ్రామాభి వృద్దిగ పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. అయినప్పట్టికి జిల్లా యంత్రాంగం మాపై ఐటి సస్పెక్షన్, మోలు ఇస్తు మానసికంగా తీవ్ర ఒత్తిడిలకు గురి చేస్తున్నారని, నార్నూర్ పంచాయతి కార్యదర్శి దినేష్ సస్పెన్షన్ మమల్ని తీవ్రంగా కలిచివేసనందున మండల పంచాయతీ కార్యదర్శులు అందరం కలిసి నాలుగు రోజులపాటు సామూహిక సెలవు ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల పలు గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.