నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించే యోగా శిక్షణ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు తరలి రావాలని నిర్వాకులు మద్నూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ ఒక ప్రకటన ద్వారా మండల ప్రజలను కోరారు. ఆదివారం నిర్వహించే యోగ శిక్షణ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తామని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలలోపు గురు ఫంక్షన్ హాల్ కు హాజరుకావాలని కోరారు. ఈ యోగా కార్యక్రమంలో బేసిక్ సూర్య నమస్కారం సూక్ష్మ యోగ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. భారతీయ పురాతన సంస్కృతి యోగా అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం భారతీయులందరికీ గర్వకారణం అని డాక్టర్ కొనియాడారు.