రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కించి నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, హీరో సోహైల్ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. హీరో రిషి మాట్లాడుతూ, ‘గరుడ పురాణం ఎలిమెంట్స్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. రుద్ర అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నా. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. దానిలో చనిపోయిన వారంతా తిరిగి వస్తే ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు. దర్శకుడు నందీష్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. దర్శకుడిగా నాకు, నిర్మాతగా లోహిత్‌కి ఇది మా ఫస్ట్ మూవీ. టీజర్ అందరికీ నచ్చిందనుకుంటున్నా’ అని అన్నారు.
‘మ అశ్విని ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న మొదటి సినిమా ఇది. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కిస్తున్నాం. నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అని నిర్మాత విజరు లోహిత్ చెప్పారు. హీరోయిన్ ప్రియాంక కుమార్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.