తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దే

నవతెలంగాణ – మాక్లూర్
తెలంగాణలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ దే నాని జిల్లా జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు అన్నారు. శనివారం మండలంలోని సింగంపల్లి, దుర్గనాగర్ తండాల్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజనోత్సవాల కార్యక్రమన్ని నిర్వహించారు. ముందుగా సింగంపల్లి, కింది తండాలో గిరిజన ప్రజలతో కలిసి సేవాలాల్ మందిరంలో జగదాంబ అమ్మవారికి పూజలుచేసి అనంతరం భోగ్ నైవేద్యం సమర్పించారు. సింగంపల్లి, కిందితండా లో జెడ్పి నిధులతో రూ. 3 లక్షలతో ఏర్పాటు చేసిన హై మాస్ లైట్లను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత మాక్లూర్ మండలంలో 6 తండాలకు జీపీ లుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అలాగే అక్కడ నూతన గ్రామపంచాయతీ భవనాలు నిర్మించుటకు రూ.20.00 లక్షల చొప్పున నిధులు కూడా విడుదల చేయడం జరిగిందని, ఎస్టీ రిజర్వేషన్లు కూడా 6 నుండి 10 చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరు పిల్లల్ని బాగా చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ గోవింద్, డీపీఓ జయసుధ, ఎంపీడిఓ క్రాంతి, సర్పంచులు రాథోడ్ గంగాధర్, పద్మ, ఎంపీటిసి రాథోడ్ మీరాబాయ్, బారాస నాయకులు నారాయణ, పీర్సింగ్, నారాయన్సింగ్, జోర్సింగ్, ఇరుగ్రామాల పెద్దలు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు.