– ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణా ఆదిత్య, పివో అంకిత్
– గిరిజన ఆశ్రమ పాఠశాల ఇంగ్లీష్ మీడియం లో ఘనంగా గిరిజన ఉత్సవాలు
నవతెలంగాణ -తాడ్వాయి
సొంత రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన బిడ్డల చిరకాల డిమాండైన స్వయం పాలనా స్వప్నాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారని ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మేడారంలోని గిరిజన ఆశ్రమ(బాలికల)పాఠశాల ఇంగ్లీష్ మీడియం లో ఘనంగా తెలంగాణ గిరిజన ఉత్సవాలు నిర్వహించారు. సందర్భంగా ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య పిఓ అంకిత్ లు మాట్లాడుతూ విసిరేసినట్లుగా ఉన్న తండాల్లో, గాయాలతో గోసపడ్డ గోండు గూడెల్లో నేడు అద్భుత ప్రగతి చోటు చేసుందని చెప్పారు. కలెక్టర్ కృష్ణా ఆదిత్య పీవో అంకిత్ లు మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి సభలో వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత.. సుమారు 3,500 తండాలు, గూడేలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలుగా మార్చింది. గిరిజనులకు స్వయం పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సొంత పాలనలో గిరిజన తండాలు, గూడేలు అభివృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నర్సిరెడ్డి, లైబ్రరీ చైర్మన్ గోవింద్ నాయక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఇలా త్రిపాఠి, స్థానిక సర్పంచ్ చిడం బాబురావు లు గిరిజన గిరిజన సంక్షేమం, అభివృద్ధి, గిరిజన వికాసం ప్రభుత్వ పథకాలు గురించి మాట్లాడారు. మొదట ఈ కార్యక్రమం ఆదివాసి గిరిజన మ్యూజియం లో ప్రారంభమైంది. మ్యూజియంలోని కొమరం భీం విగ్రహానికి సత్కరించారు. ఆదివాసి, బంజారా ముత్యాలతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నిర్వహించారు. ఆదివాసి నృత్యాలు, బంజారా నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొంది వాణిశ్రీ, ఓ ఎస్ డి అశోక్ కుమార్, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్, అధికార ప్రతినిధి మహిపతి అరుణ్ కుమార్, సీఈవో ప్రసన్నారని ప్రసన్న రాణి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య జిల్లా మత్స్ శాఖ అధికారి శ్రీపతి జిల్లా సహకార అధికారి సర్దార్ సింగ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గిఫ్ట్ డైరెక్టర్ ఐటిడిఏ పోచం, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అల్లెం అప్పయ్య, డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ పులుసం నాగేశ్వరరావు, స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, పీసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, ఐటీడీఎం ప్రతాప్ రెడ్డి, ఆదివాసి గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు గిరిజనులు మహిళలు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.