ఓఆర్‌ఆర్‌ లీజు రద్దు చేయండి-కేటీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) లీజు విషయంలో కాంగ్రెస్‌ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు విమర్శించారు. గత ప్రభుత్వం తప్పుచేసినట్టు భావిస్తే, ఓఆర్‌ఆర్‌ లీజును రద్దుచేసి, మళ్లీ టెండర్లు పిలవాలని సవాల్‌ చేశారు. తమ చేతిలో ఉన్న పని చేయకుండా బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మబోరని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లీజు విషయంలో మేము నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలను అనుసరించామని వివరించారు.