విక్రమ్‌ తర్వాత అమరన్‌

విక్రమ్‌ తర్వాత అమరన్‌శివకార్తికేయన్‌, రాజ్‌కుమార్‌ పెరియసామి కాంబినేషన్‌లో కమల్‌ హాసన్‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘అమరన్‌’.ఈ చిత్ర తెలుగు థియేట్రికల్‌ హక్కులను శ్రేష్ఠ్‌ మూవీస్‌ అధినేతలు సుధాకర్‌ రెడ్డి, నిఖిత రెడ్డి పొందారు. తెలుగు, తమిళ భాషల్లో శివకార్తికేయన్‌ నటిస్తున్న యాక్షన్‌ చిత్రమిది. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న థియేటర్‌లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో హీరో నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి, ఆయన సోదరి నిఖితారెడ్డి ఈ సినిమా ఏపీ, టీఎస్‌ల థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. సెన్సేషనల్‌ హిట్‌ ‘విక్రమ్‌’ తర్వాత కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌తో శ్రేష్ట్‌ మూవీస్‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ‘ఇండియాస్‌ మోస్ట్‌’ అనే పుస్తకంలోని ‘మేజర్‌ వరదరాజన్‌’ కథ ఆధారంగా తెరకెక్కుతోంది.