‘మెట్రో’ పెయిడ్‌ పార్కింగ్‌ అమలు వాయిదా

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని నాగోల్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్ల ఆవరణలో పెయిడ్‌ పార్కింగ్‌ అమలు వాయిదా పడింది. అయితే, త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు ఇటీవల ఎల్‌అండ్‌టీ మెట్రో సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తు తానికి ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు సంస్థ శనివారం ప్రకటించింది. ప్రయాణికుల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత.. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎక్స్‌లో పేర్కొంది. తొలుత ఆగస్టు 25వ తేదీ నుంచి నాగోల్‌, సెప్టెంబర్‌ 1 నుంచి మియాపూర్‌ మెట్రో పార్కింగ్‌ లాట్‌లో పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ప్రకటించారు. అయితే, దీనిపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.