శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో కృష్ణాష్టమి ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు వారి చిన్నారులను చిన్ని కృష్ణుడు, గోపికల వేషాధారణలో అలంకరించి అందంగా ముస్తాబైన చిన్నారులను చూసి మురిసిపోయారు. కృష్ణుడి పటం వద్ద ప్రధానోపాధ్యాయుడు తోటకూర యాదయ్య పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని లీలలను తెలిపే ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు కేరింతలతో ఉట్లు కొట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.