అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి

Illegal deputations should be cancelled– ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ  ములుగు జిల్లా శాఖ 
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయకుండా  జిల్లా విద్యాశాఖాధికారి ఏక పక్షంగా తన ఇష్టానుసారంగా నిబంధనలు ఖాతరు చేయకుండా టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు మళ్ళీ తెరలేపారనీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ములుగు జిల్లా శాఖ ఉపాధ్యాయులు అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ములుగు జిల్లా శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశించి సంబంధిత ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా మ్యూచ్యువల్ సర్దుబాట్ల పేరుతో అవినీతి కి అక్రమాలకు పాల్పడుతూ ములుగు జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేకతను చాటుతున్నారని అన్నారు. ఇట్టి అక్రమ సర్దుబాట్లను వెంటనే రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి ములుగు జిల్లా శాఖ డిమాండ్ చేస్తున్నన్నమన్నారు.బదిలీలు పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై పుంఖాను పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చిన తనపై ఎలాంటి చర్యలు లేవనే ధీమాతో జిల్లా విద్యాశాఖాధికారి రూల్స్ అతిక్రమణ పరంపరను యధేచ్చగా కొనసాగిస్తున్నారని యు.ఎస్.పి.సి ఆరోపించింది. వెంకటాపూర్ మండలంలోని ఎం యు పి ఎస్ నారాయణపూర్ లో ఉన్న ఉపాధ్యాయున్ని  తాడ్వాయి మండలంలోని ఎంపీపీ ఎస్ గోనెపల్లికి ,గోనెపల్లి ఉపాధ్యాయున్ని నారాయణపూర్ కు అలాగే  ఏటూర్ నాగారం మండలం చిన్న బోయినపల్లి , ములుగు ‌మండలంలోని రామ్ నగర్ తండా‌ ఉపాధ్యాయుల‌ పరస్పర సర్దుబాట్లు ఏ నిబంధనల ప్రకారం  చేశారో తెలియజేయాలని జిల్లా విద్యాశాఖాధిగారిని‌ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలతో ‌సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి హేతుబద్ధంగా సర్దుబాట్లు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ములుగు జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చాపబాబు,జిల్లా నాయకులు వాసుదేవ రెడ్డి,గన్ రెడ్డి ఆదిరెడ్డి,హట్కర్ సమ్మయ్య, రేగా నరేంద్ర కుమార్ చంద్రారెడ్డి, సూర్య తదితరులు పాల్గొన్నారు.