భారీ వాహనాలకు అనుమతి ఇచ్చేలా చూడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ కు అభయారణ్య ఆంక్షల ఎత్తివేత కమిటీ నాయకులు కోరారు. సోమవారం జన్నారం పట్టణంలో ఎమ్మెల్యే పాయల శంకర్ కు వారు వినతిపత్రం సమర్పించారు. భారీ వాహనాలు రాకపోవడంతో ప్రజలకు ఉపాధి దొరకడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఆంక్షల ఎత్తివేత కమిటీ నాయకులు భూమాచారి, దాసరి తిరుపతి, కొండపల్లి మహేష్, ఎజాజ్, బీజేపీ నాయకులు గోలి చందు పాల్గొన్నారు.