
నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
తొర్రూర్ డివిజన్ కేంద్రంలో విష జ్వరాలతో బాధపడుతూ పట్టణాన్ని చెందిన బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. తాజాగా తొర్రూర్ పట్టణానికి అనుకొని ఉన్న వెంకటాపురం గ్రామ శివారు కేబుల్ ఆ తండాకు చెందిన బానోతు లచ్చిరాం తీవ్ర జ్వరంతో బాధపడుతూ వర్ధన్నపేటలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. దీంతో ప్రభుత్వ వైద్య అధికారులు హుటాహుటిన వెంకటాపురం గ్రామంలోని కేబుల్ సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకొని గ్రామంలో ఎంతమందికి విష జ్వరాలు ఉన్నాయని తెలుసుకొని, పరీక్షలు చేశారు. అనంతరం వారందరీకీ రాపిడ్ టెస్టులు చేశారు. ఈ గ్రామంలో ఈ విధంగా ఉంటే తొర్రూర్ డివిజన్లోని అన్ని గ్రామాలలో పరిస్థితి ఎలాగ ఉందో అర్థం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.