
పట్టణంలోని జర్నలిస్టు కాలనిలో ఆత్రేయ పాఠశాలలో మంగళవారం ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు. సంబురంగా నిర్వహించినారు గోపికలు,యశోద నందులు,దేవకీ వసుదేవుల, బలరామ వివిధ వేషధారణతో చిన్నారులు నృత్య కేళి లతో పండగ సంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ సంసృతి సంప్రదాయాలు,మరియు చిన్నారులకు చదువుతో పాటు సాంసృతిక కార్యక్రమాలు జరిపితే ఉల్లాసంగా ఉంటూ చదువు మీద కూడా ఆసక్తి చూపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేష్,ఉపాధ్యాయులు వంశి,నవ్య,ప్రణిత,రజిత,ధనలక్ష్మి రుతిక,స్వరూప,రాకేష్,విష్ణు,భవాని,శివాని తల్లిదండ్రులు పాల్గొన్నారు.