లయన్ సహారా ఆధ్వర్యంలో మహాలక్ష్మి చికెన్ సెంటర్ 28వ వార్షికోత్సవ సందర్భంగా ఆర్యనగర్ నిజాంబాద్ లో ప్లాస్టిక్ సంచుల బదులు నేను ప్లాస్టిక్ను కాను అనే నినాదంతో కూడిన 90 రోజులలో కరిగిపోయే సంచులను నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. దీని గురించి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ లయన్ సహార అధ్యక్షుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే లయన్స్ క్లబ్ సహారా ముఖ్యమైన కమర్షియల్ షాప్ లలో సమావేశాలు నిర్వహించి ప్రజల కొరకు మంచి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ జిల్లా కార్యదర్శి ఉదయ సూర్య భగవాన్, కోశాధికారి ధనుంజయ రెడ్డి, సభ్యులు కపిల్, రమేష్ షాప్ యజమాని గుణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.