– మండల అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ గోపి సత్యనారాయణ.
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు కో ఆప్షన్ ఇతర ప్రజా ప్రతినిధులు ప్రజా సేవే పరమావధిగా పని చేశారని మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి గోపి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్ ఆర్ ఎస్ గార్డెన్ లో సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ అధికారులుగా అవార్డు తీసుకున్న ఎఫ్ ఆర్ ఓ, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్,ను మండల లోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు, ఎంపీపీ జడ్పిటిసి కోఆప్షన్ లను శాలువాతో సన్మానించారు. అనంతరం వారికి మున్నూరు కాపు సంఘం షీల్డ్ ను అందించారు., కాపు కులస్తులు అంటేనే గ్రామాలకు కాపుగా ఉండి అందరికీ అన్నం పెట్టే వారన్నారు. అలాంటి సంఘాన్ని బలోపేతం చేయడానికి కాపు సంఘ నాయకులు కృషి చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో మున్నూరు కాపు సంఘం కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కాపు సంఘం అభివృద్ధికి సంఘ నాయకులు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో, మాది జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ ఎంపీపీ మాదాడి సరోజన రవీందర్రావు, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, ఎఫ్ఆర్ఓ ఆఫీసుద్దీన్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రియాజుద్దీన్ సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు జాడి గంగాధర్ బిజెపి మండల అధ్యక్షుడు మధుసూదన రావు, పట్టణ అధ్యక్షుడు లెక్కల మల్లయ్య, మున్నూరు కాపు సంఘం మండల గౌరవ అధ్యక్షులు కొంతం శంకరయ్య,నాయకులు దాసరి రాజన్న చిందం చంద్రయ్య ఉప్పు చంద్రశేఖర్,పూదరి నర్సయ్య,కాసెట్టి రాజన్న,సిటీమల భరత్ కుమార్,నెమలికొండ ఆశరాజ్,వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.