
రెంజల్ మండలం ధూపల్లి గ్రామంలో మంగళవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామంలోని హనుమాన్ మందిరం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన వీధి లేకుండా ర్యాలీ నిర్వహించారు. యాదవ సంఘం బాలికలు గోపికల వేషాదరణ ధరించి నాట్యం చేయడం పలువురిని ఆకట్టుకుంది .యాదవ సంఘం వద్ద పుట్టిన ఏర్పాటు చేయగా, చిన్నారులు, యువత సుమారు రెండు గంటల వరకు ఊట్టిన కొట్టడానికి నాన అవస్థలు పడ్డారు. చివరికి యువత ప్రయత్నం చేసి ఉట్టిని కొట్టగా గెలుపొందిన వారికి బ్రాస్లైట్ ను బహుకరించారు. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ింగన్న యాదవ్, శంకర్ యాదవ్, నరసయ్య యాదవ్, సాయిలు యాదవ్, గంగాధర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.