పేదదళితుల భూములను స్వాహా చేసిన భూస్వాములపై రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నిరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతీరం నాయక్ విమర్శచారు. గత మూడు సంవత్సరాల నుంచి మాతు సంగెం శివారులో గల 119 175 లో దళితులు గిరిజనులు 40 కుటుంబాలు సుమారు 60 ఎకరాల భూమి గిరిజను దళితులు సాగు చేసుకుంటుంటే అక్కడ ఉన్న భూస్వామి సంగారావు రాజేందర్ రావు లాంటోళ్లు వారి మీద దాడికి పూనుకొని పోలీసుల కేసు పెట్టి ఆ భూమి నుంచి ఖాళీ చేయించారు. తహసిల్దార్లు సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పగిస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్న సర్వేకు నోచుకోవడం లేదు. దళితులు మాత్రం కాళ్ల చెప్పులు అరిగిన తిరుగుతూ నిరాశకు గురవుతున్నారు. ఆ భూమి మీద ఎవరు కూడా పోవద్దని హెచ్చరించిన అవకాశం చూస్తూ రోజుకు రెండు ఎకరాలు చొప్పున చదును చేసుకుంటూ ఇతర గిరిజనులకు అమ్ముకుంటున్నాడు. ఇప్పటికే నాలుగు ఎకరాల పట్ట చూపించుకుంటూ 14 ఎకరాలు అమ్ముకున్నాడు. ఎవరైనా అడిగితే అదే పట్టా పాస్పోర్ట్ చూపిస్తా ఉంటాడు. ఇది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య రెవెన్యూ అధికారులు మాత్రం మాకేమి సంబంధం లేనట్టుగా ఆ భూమి తోని మాకేం అక్కర లేనట్టుగా అనుసరిస్తా ఉన్నారు. ఈరోజు గాంధారి తహసిల్దార్ కు ఎస్ఐ ఫిర్యాదు చేశామని ఇప్పటికైనా వాళ్లు మానుకుంటే మంచిది లేకుంటే తెలంగాణ రైతు సంఘం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనుక్కుంటామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ రెవెన్యూ అధికారులు వెంటనే ఆ భూమిని సర్వే నిర్వహించి పేద దళిత గిరిజనులకు పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మహా పోరాటాన్ని పూనుకోవడం కోసం రైతాంగాన్ని చేతన్యం చేసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతిరామ్ నాయక్ తో పాటు గ్రామ నాయకులు సాయిలు రాములు సంఘవా స్వప్న సాయవ తదితరులు పాల్గొన్నారు.