గాజుల శ్యాం కుమార్ కు డాక్టరేట్ ప్రధానం..

Gajula Shyam Kumar's Doctorate Principal..నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్  కెమిస్ట్రీ విభాగం  పరిశోధక విద్యార్థి గాజుల శ్యాం కుమార్ కు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి మావురపు పర్యవేక్షణలో ” డిజైన్, సింథసిస్  అఫ్ నావెల్ హెటెరోసైక్లిక్ సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లు మరియు వాటి మాలిక్యులర్ డాకింగ్ అధ్యయనాలు  అనే అంశంపై పరిశోధన జరిపారు. మంగళవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినల్ ప్రొఫెసర్ ఏ.కృష్ణంరాజు, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ హాజరై  పరిశోధన సిద్ధాంత గ్రంథం పై విస్తృతమైన, విఫలమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఎక్సటర్నల్ ఎగ్జామినర్ అడిగిన అన్ని ప్రశ్నలకు పరిశోధక విద్యార్థి   ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు  ఇవ్వడంతో ఎక్సటర్నల్ ఎగ్జామినర్ పరిశోధన పట్ల  సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ పరిశోధనలో రూపకల్పన చేసి  నావెల్ హేటెరో సైక్లిక్ సంశ్లేషణ మాలిక్యులర్లు   క్యాన్సర్ ఏజెంట్స్ ను  గతం కంటే వేగంగా  నివారించడానికి  మార్గం సుగమ మైనదని పేర్కొన్నారు.  రాబోయే రోజులలో ఈ పరిశోధన ఫలాలతో వేగవంతమైన, నాణ్యమైన, మేలైన  డ్రగ్స్ తయారు చేయవచ్చునని పేర్కొన్నారు.అతి తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా క్యాన్సర్ నివారించడానికి పార్మా –  డ్రగ్స్ ను ఏ విధంగా తయారు చేయాలో  తెలిపారు.
ఈ పరిశోధన ఫలాల వలన ప్రజలకు అతి తక్కువ ధరలకు డ్రగ్ను అందించవచ్చునని పేర్కొన్నారు.శ్యామ్ అందించిన జవాబులకు  బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ  డిగ్రీ ప్రధానానికి   ఆమోదం తెలిపారు.ఈ పరిశోధన కొరకు జరిగిన ప్రయోగంలో రుజువైన ఫలితాలతో  రాసిన  మూడు వ్యాసాలు  ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ ప్రమాణాలున్న  అత్యధిక ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కలిగిన  జర్నల్స్  ప్రచురించడం  ఈ పరిశోధనకు మరింత  గుర్తింపు వస్తుందని ఎక్సటర్నల్ ఎగ్జామినర్ ప్రొఫెసర్  కృష్ణంరాజు  పరిశోధకుడిని అభినందించాడు .ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఫార్మసిటికల్ కెమిస్ట్రీ  అధిపతి డాక్టర్ వాసం చంద్రశేఖర్,  ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, కంట్రోలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ, డాక్టర్ బోయపాటి శిరీష,   పర్యవేక్షకులు డా. సత్యనారాయణ రెడ్డి,  డాక్టర్ ప్రసన్న శీల  కాంటాక్ట్ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.