– సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ కార్యాలయ సిబ్బంది వినతిపత్రం
నవతెలంగాణ – బెజ్జంకి
మంగళసూత్రాలు,మట్టేలు తనఖా పెట్టి..కిరాణా దుకాణాల్లో అప్పులు చేసి పాఠశాలల్లో మధ్యాహ్న బోజనం నిర్వహిస్తున్నామని మా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్టోబర్ 14 నుండి నిరవధిక సమ్మెకు పూనుకుంటామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మీసం లక్ష్మన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మంగళవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కార్యాలయ సిబ్బందికి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ అధ్వర్యంలో తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వినతిపత్రమందజేశారు.ఈ సందర్భంగా లక్ష్మన్ మాట్లాడారు.అంగన్వాడీ కేంద్రాల వలే మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేతనమందిస్తామన్న అంశాన్ని అమలు చేసి విరమణ సమయంలో రూ.5 లక్షలతో పాటు నెలకు రూ.5 వేలు పేన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.మధ్యాహ్న భోజన కార్మికులకు ఏకరూప దుస్తులతో పాటు పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు.కొమురవ్వ,జిల్లా కనకవ్వ, రామవ్వ,భూలక్ష్మి నిర్మల,వజ్రవ్వ,నర్సవ్వ,రాధ తదితరులు పాల్గొన్నారు.