జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు

– రాష్ట్రానికి చెందిన ఇద్దరు టీచర్లు ఎంపిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జెడ్పీహెచ్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి పెసర, రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జెడ్పీహెచ్‌కు చెందిన తాడూరి సంపత్‌కుమార్‌ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 50 మంది ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ ఐదున జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల ఐదున న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. వారికి రూ.50 వేల నగదుతోపాటు ధ్రువపత్రం, రజత (వెండి) పతకంతో సత్కరిస్తారు.