మద్నూరు మండల కేంద్రంలోని మద్నూర్ రైతు వేదిక యందు రేషన్ కార్డు లేని రైతులకు కుటుంబ నిర్ధారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ నందు మండల వ్యవసాయ అధికారి రాజు రేసన్ కార్డు లేని రైతుల దరఖాస్తులని పరిశీలించి, యాప్ నందు నమోదు చేయడం జరిగింది. అలాగే ఈనెల 29 నుండి మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ మండలం తో పాటు డోంగ్లి మండలలో పర్యటించి అన్ని గ్రామాల్లో రేషన్ కార్డు లేని రైతుల యొక్క కుటుంబ నిర్ధారణ చేసి యాప్ యందు ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు అనిల్, విశాల్, సంపత్, బజన్న, గజనన్, సంరిన్, సంయుక్త. ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.