
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జన వికాస సెంటర్ మేనేజర్ రమ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దవంగర, ఉప్పెరగూడెం, అవుతాపురం, చిట్యాల గ్రామాల్లోని జన వికాస సభ్యులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వాతావరణ మార్పుల కారణంగా అనేక ఉపద్రవాలు వస్తున్నాయని అన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నట్టు తెలిపారు. పర్యావరణాన్ని నాశనం చేయడం కారణంగా ఇటువంటి విపత్తులను చవిచూడాల్సి వస్తున్నదని, మంచి ప్రకృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు. మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెంటర్ మెయిన్ కోఆర్డినేటర్ మద్దెల రమ, శైలజ, శోభ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.