– త్రాగు నీటి లీకేజీలను ఎప్పటికప్పుడు అరికట్టాలి
– ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ
– సెప్టెంబర్ 30 లోపు ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు పూర్తిగా పరిష్కరించాలి
– గ్రామాలలో డార్క్ ఏరియా ఉండకుండా స్ట్రీట్ లైట్ల ఏర్పాటు
– ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కనీస మౌలిక వసతులు కల్పించాలి
– ధర్మారం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
నవతెలంగాణ – ధర్మారం
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి విస్తృతంగా పర్యటించారు కొత్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి సెంటర్, వైరల్ జ్వరాలకు గురైన బాధితుల ఇండ్లు, కటికనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రైతు వేదిక, మల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, మండల తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో చేపట్టాల్సిన పారిశుధ్య చర్యలు, త్రాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు, రేషన్ సరఫరా, ఇందిరా మహిళా శక్తి మొదలగు పలు అంశాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రతి ఇంటి నుంచి రోజు చెత్త సేకరించి, దానిని సెగ్రిగేట్ చేయాలని అన్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సరఫరా సజావుగా ఉండేలా పర్యవేక్షించాలని, ఎక్కడైనా వచ్చే నీటి లీకేజీలు వంటి సమస్యలను సంబంధిత అధికారులతో సమన్యాయం చేసుకుంటూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాల వ్యాప్తి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీరు నిల్వ ఉండటం వల్ల వచ్చే ప్రమాదాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. గ్రామాలలో అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు మొదలగు సిబ్బంది ఫ్రైడే, డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు దోమల నివారణకు రెగ్యులర్ గా ఫాగ్గింగ్ నిర్వహించాలని, మురికి కాల్వలను శుభ్రం చేయాలని అన్నారు గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమం కింద నాటిన మొక్కల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ఫ్యాన్, కుర్చీ విద్యుత్ సరఫరా లైట్లు మొదలగు మౌలిక వసతుల కల్పన చేయాలని కలెక్టర్ సూచించారు మండల పరిధిలో పెండింగ్ ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు సెప్టెంబర్ 30 నాటికి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో ఉండే విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అవసరమైన చోట నూతన విద్యుత్ లైన్ లు ఏర్పాటు చేయాలని అన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు గ్రామాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో సింగిల్ యూసెజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, మహిళా స్వశక్తి సంఘాలకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద అందించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశ లత, మండల ప్రత్యేక అధికారి , పంచాయతీరాజ్ శాఖ డీఈ , మిషన్ భగీరథ డీఈ రోహిత్, ఎంపీడీవో ఐనాల ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ అంబటి రజిత, వివిధ శాఖల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.