
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో వికలాంగులకు బస్ పాస్ రినివల్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ విలేకరులకు తెలిపారు. గతంలో ఉచితంగా వికలాంగులకు బస్ పాస్ సౌకర్యం ఉన్నవారికి రినివల్ చేస్తున్నట్లు, మద్నూర్ గ్రామంలో ఈ రోజు దండోరా సైతం వేయించినట్లు సందీప్ కుమార్ వివరించారు. వికలాంగులు బస్సు పాస్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.