పేదరికంలో వికసించిన విద్యా కుసుమం

The safflower of education blossomed in poverty– మీషన్ భగీరథ ఎఈఈ గాఎంపికైన ప్రశాంత్
నవతెలంగాణ – ముధోల్
మండలంలోని కారేగాం గ్రామంలో పేద కుటుంబంలో జన్మించి , కష్టపడి చదివి మిషన్ భగీరథ పథకంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. తల్లి బీడీలు చూడుతు  తండ్రి మత్సకారుడుగా ,రైతుగా పని చేస్తూ కొడుకుని  చదివించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై విధంగా  ప్రోత్సహించారు .దీంతో ఇటీవల మిషన్ భగీరథ ఏఈఈ గా ప్రశాంత్ కూమార్ ఉద్యోగాన్ని సంపాదించాడు. వివరాల్లోకెళితే… కారేగాం  గ్రామానికి చెందిన లక్ష్మి – రాములు కుమారుడు  అయిన ప్రశాంత్ కుమార్ పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించారు .  ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యను అనంతరం వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విద్యను  అభ్యసించారు.ఆనంతరం  ఎంటెక్ కూడా పూర్తి చేశారు. వివిధ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాడు ‌. కొడుకు చదువు కోసం తల్లి బీడీలు చూడుతు  తండ్రి మత్సకారుడుగా పనిచేసి కొడుకు కు చదువు నేర్పించారు. దీంతో విద్యార్థి ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి టి జి పి ఎస్ సి విడుదల చేసిన సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో  మీషన్ భగీరథ పధకం లో ఎఈఈ గా ఎంపికయ్యాడు. దీంతో ఏఈఈగా ఎంపికై గ్రామానికి పేరు తెచ్చిన ప్రశాంత్ కుమార్ ను గ్రామస్తులు, పలువురు నాయకులు అభినందించారు.  ఈసందర్భంగా ప్రశాంత్ కుమార్ బుధవారం నవతెలంగాణ తో మాట్లాడారు.తల్లి దండ్రుల కష్టంమును  గుర్తు చేసుకుంటూ, బాబాయ్ శ్రీనివాస్ ప్రోత్సాహం తో కష్టపడి చదివి ఉద్యోగాన్ని సంపాదించాను . నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు  సహకారం కూడా మరువలేనిది.