ముధోల్ సీఐ కి ఘన సన్మానం 

Great honor for Mudhol CIనవతెలంగాణ – ముధోల్
ముధోల్  సర్కిల్ సిఐ  మల్లేష్  కు ఇటివల  ఉత్తమ అవార్డు  వచ్చిన  సందర్భంగా ఆమ్ఆద్మీపార్టీఆధ్వర్యంలో  బుధవారం సాయంత్రం ముధోల్ పోలిస్ స్టేషన్లో సిఐ ని ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ మాట్లాడుతూ..  సిఐ చేసిన కృషికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15  నా అవార్డు ఇవ్వడంసంతోషకరమని అన్నారు. రానున్న కాలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరింత కృషి చేయాలని  ఆయన కోరారు.ఈకార్యక్రమం ఆరిఫ్ హైమద్,  సామాజిక కార్యకర్త వినోద్, హ్యూమన్ రైట్స్ నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  సయ్యద్ హుజూర్ అక్బర్ అలీ, నగేష్, తదితరులు పాల్గొన్నారు.