సెప్టెంబర్‌ 21 నుంచి ‘ఎస్‌ఏ-1’ పరీక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చేనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అదేనెల 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌లో ప్రకటించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) అధికారులు ప్రశ్నాపత్రాల రూపకల్పనలో ఉన్నారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. ఈనెల 30 వరకు సిలబస్‌ను పూర్తి చేయాలని డీఈవోలు, ఆర్జేడీలకు విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్‌ రెండు నుంచి 14 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు దసరా సెలవులుంటాయి.