– రేపటి నుంచి మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
– పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
– హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బిగ్ అలర్ట్. రాష్ట్రంలో శుక్ర, శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె.నాగరత్న హెచ్చరికలు జారీ చేశారు. గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. మరోవైపు మంగళవారం జార్ఖండ్ పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై బలహీనంగా ఉంది. ఈ అల్పపీడనాలు, నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలున్నాయి. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఆ తర్వాత మూడ్రోజులు ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షం పడొచ్చు. రాబోయే 48 గంటల పాటు జీహెచ్‌ఎంపీ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది.
ఆరెంజ్ హెచ్చరిక ( భారీ నుంచి అతి భారీ వర్షాలు)
30.08.24 : పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ.
31.8.24 : కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట
01.09.24 : ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
ఎల్లో హెచ్చరిక (మోస్తరు నుంచి భారీ వర్షాలు)
29.08.24 : ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం
30.08.24 : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి
31.08.24 : హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, మెదక్, కామారెడ్డి
01.09.24 : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌బాద్