ఆలూరు ఉన్నత పాఠశాలలో ఘనంగా ధ్యానచంద్ జయంతి వేడుకలు

నవతెలంగాణ ఆర్మూర్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు మండల కేంద్రంలో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించినారు. హాకీ క్రీడల్లో 8 స్వర్ణ పతకాలు సాధించి పెట్టారని పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ జి రాజేష్ తెలిపారు. దేశం మొత్తం గర్వించదగ్గ క్రీడాకారులు అని ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిడి రాజేష్ అన్నారు. మన దేశంలో క్రీడాకారులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శౌరి రెడ్డి, గణేష్, శ్రీకాంత్, పిఆర్టియు అధ్యక్షులు ఎండి అశ్వక్ హైమద్, హనుమాన్లు, రాం ప్రభువు, చిత్ర, సుమలత, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.