నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోవడ్లం గ్రామంలో గురువారం రోజున ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఇన్చార్జ్ ఎంపీడీవో పరిశీలిస్తున్నారు.గత నాలుగు సంవత్సరాల క్రితం ఆన్లైన్ మీ సేవలో ఎల్ఆర్ఎస్ కోసం ప్లాట్ల లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోగా, వాటికి సంబంధించి అధికా రులుపరిశీలించారు.ప్లాట్ల కొలతలు,పరిధిని పరిశీలించినట్లు ఇన్ఛార్జి ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్లాట్లు,తదితర ఆస్తులకు సంబంధించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకోవాలని, కొలతలు, పరిధి ప్రకారము సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరుగుతుందన్నారు. కార్య క్రమంలో పంచాయతీ సెక్రటరీ శివాజీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.