నూతన జిపిగా తెట్టే కుంట తండా

పలు తండాల.. జీపీలు మార్పు
నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని తిర్మలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టే కుంట తండాను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ప్రకటించిన్నట్లు గురువారం స్థానిక ఎంపీడీఓ కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడిస్తున్నా.. ఆర్ అండ్ ఆర్ కాలనీ పేరును శివరాంపురం గ్రామ పంచాయతిగా పేరుగా మార్చిన్నట్లు తెలిపారు. జయరాం తండా (ఎస్) గ్రామ పంచాయతిలోని సూర్య తండా, శ్రీరాం నగర్ తండాను వెంకటేశ్వర్ పల్లి గ్రామ పంచాయతిలో కలపడం జరిగిందని పేర్కొన్నారు.బాలాజీ తండా గ్రామ పంచాయతిలోని బీల్ నాయక్ తండా,  టేకుల తండాలను ఉకల్ గ్రామ పంచాయతిలో కలపడం జరిగింది వివరించారు.