సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నవతెలంగాణ పెద్దవంగర: వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వడ్డెకొత్తపల్లి పల్లె దావఖాన వైద్యాధికారి రాజ్ కుమార్ అన్నారు. గురువారం రేఖ్య తండాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ సీజన్ లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ఇంటి పరిసరాల్లో మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిచారు. కార్యక్రమంలో ఏఎన్ఎం బూబ, ఆశా కార్యకర్త హేమలత తదితరులు పాల్గొన్నారు.