రైతు భరోసా డబ్బులు వెంటనే జమ చేయాలి 

The farmer's insurance money should be deposited immediately– రైతు కూలీలకు ఇచ్చిన హామి  నెరవేర్చి,  రైతాంగ సమస్యలను పరిష్కారించాలి
– సీపీఐ(ఏం)  జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్
నవతెలంగాణ –  కామారెడ్డి 
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15 వేల రూపాయలు వేంటనే రైతులకు ఖాతా లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ(ఏం) పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఏం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ అర్హులైన రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేసారు. రైతుల రూ.2 లక్షల రుణమాఫీకి ఇంకా అర్హులైన రైతులందరికీ రావడం లేదని ఎదో ఒక సాకుతో రుణమాఫీ కాలేదని రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రూ.26 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.15 వేల కోట్లు, కేటాయింపులు చేసారు. రైతు భరోసా డబ్బులు జమ చేయడం లేదు కావున వెంటనే రైతు భరోసా డబ్బులు జమ చేయాలన్నారు. రైతు రుణమాఫీలో  కొంత మంది అర్హులకు రుణాలు రద్దు కావడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 12.12.2018 నుండి 9.12.2023 వరకు బాకీ ఉన్న వారికి రుణమాఫీ వర్తించాలి. కానీ అ తేదీల మధ్య బాకీలు ఉన్నా వారికి కొందరికి వర్తించడంలేదు. ధరణి లోపాలను సరిచేయడానికి మార్చి 1 నుండి  20 వ తేది వరకు విచారణ జరిపినప్పటికి లోపాలతో ఇబ్బంది పడుతున్నవారికి సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాంటి రైతులను గుర్తించి వెంటనే రుణమాఫీ చేయాలన్నారు. క్వీంటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం సన్నధాన్యానికే బడ్జెట్‌లో పరిమితం చేసిందన్నారు. 33 రకాల సన్నధాన్యం వంగడాలను విడుదల చేసి వారికి మాత్రమే బోనస్‌ ఇస్తామనడం సరికాదన్నారు. రాష్ట్రంలో 70 శాతం వరిసాగు భూమి ‘గ్రేడ్‌ ఏ’ రకాలు వేస్తారు. అందువలన బోనస్‌ను సన్నధాన్యంతోపాటు అన్ని గ్రేడ్‌లకు వర్తింప చేయాలి. మార్కెట్‌లలో ధాన్యానికి రక్షణ ఉండే విధంగా ప్లాట్‌ఫారాలు, టార్పాలిన్స్‌ అందుబాటులో పెట్టాలన్నారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారనీ,  అవసరమైన చోట కోల్డ్‌స్టోరేజీల నిర్మాణం చేయాలి. రైతు కూలీలు లకు ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి 12 వేల రూపాయలు వేంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపాలని సీపీఐ(ఏం) పార్టీ జిల్లా కమిటీ కోరుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఏం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్,కోత్త నర్సింలు తదితరులు పాల్గొన్నారు.