యువత స్వశక్తితో ఎదగాలి : ఝాన్సీ రెడ్డి

Youth should grow by self-reliance: Jhansi Reddyనవతెలంగాణరాయపర్తి
యువత సొంతంగా వ్యాపార షాపులను ఏర్పాటు చేసుకొని స్వశక్తితో ఎదగాలని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి యువతరాన్ని ఉద్దేశించి ఉపోద్ఘాటించారు. శుక్రవారం మండల కేంద్రంలో మహ్మద్ సైఫ్ అలీ ఇంజనీరింగ్ వెల్డింగ్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఆత్మవిశ్వాసంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అంచలంచెలుగా జీవితంలో ఎదగాలని హితబోధ చేశారు. యువకులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని సన్మార్గంలో నడవాలన్నారు. మండల కేంద్రంలో ఇంజనీరింగ్ వెల్డింగ్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు చేపట్టాలి
రోడ్డు మరమ్మతు పనులు చేపడుతూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే అధికారులు నిద్రావస్థ నుంచి తేరుకోకపోవడంతో రోడ్డుకు ప్రమాద స్థాయిలో ఏర్పడిన గుంత నుంచి వాహనదారులను కాపాడడానికి పిచ్చి మొక్కలే ప్రమాద సూచికలుగా నిలుస్తున్నాయని నవతెలంగాణ దినపత్రికలో గత కొత్త రోజుల క్రితం ప్రచురితం కావడంతో ఝాన్సీ రాజేందర్ రెడ్డి ధ్వంసమైన  రోడ్డు బాక్స్ కల్వర్టును పరిశీలించారు. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులతో ఫోన్ లో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.మండల కేంద్రం నుండి అంబేద్కర్ కాలనీ, కొత్త రాయపర్తి, మహబూబ్ నగర్, రాగన్న గూడెం, పెర్కవేడు గ్రామాల గుండా నెక్కొండ, మహబూబాద్ కు వెళ్లే వాహనదారులు నిత్యం ఇదే రోడ్డును ఉపయోగిస్తారు. కనుక నిత్యం వాహనదారులు ప్రయాణించే రోడ్డు సౌకర్యవంతంగా ఉండాలని తెలిపారు.
రైతులు ఇబ్బంది పడితే సహించేది లేదు
ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం తెలుసుకొని సంబంధిత జిల్లా అధికారులకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫోన్ చేశారు. రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందించాలన్నారు. అవసరమైతే యూరియా లారీ లోడులను రెండు రోజుల ముందే తెప్పించాలన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు ఇబ్బంది పడితే ఎంతటి అధికారినైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ బ్లాక్ అధ్యక్షుడు జాటోత్ హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మచ్చ రమేష్, నాయకులు గోవర్ధన్ రెడ్డి,  నర్సిరెడ్డి, ఉల్లెంగల నర్సయ్య, గబ్బెట బాబు, ఎండీ గౌస్ ఖాన్, ఆఫ్రోస్ ఖాన్, ఉస్మాన్, ఎండి మహమూద్, కోతి కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.