డయాగ్నొస్టిక్ సేవలపై ఒకరోజు శిక్షణ…

One day training on diagnostic services...– ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడిన డిప్యూటీఎంహెచ్వో డాక్టర్ శిల్పిని..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 14 రకాల  డయాగ్నోస్టిక్ సేవలలో భాగంగా జిల్లా  కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం  ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శిల్పిని హాజరై మాట్లాడారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం లో భాగంగా ఈ ఒక్కరో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల రోగుల స్క్రీనింగ్, కౌన్సిలింగ్ సేవలు అందించడానికి, జిల్లాలోని అన్ని పల్లె దవాఖానాలలో పనిచేస్తున్న మీడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, డాక్టర్లకు సూచనలు అందజేశారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. హెచ్ఐవి పాజిటివ్ అని తేలితే జిల్లాలోని వాలంటరీ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ కు రేఫర్ చేస్తారని, అవసరమైన వారికి యాంటీ రిట్రో వైరల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గంగాధర్, అడిషనల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోహర్, జిల్లా ఇమినేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వీణ లు పాల్గొన్నారు.