ఈ 28 నుండి వచ్చే నెల 10 వరకు మండలంలో నిర్వహించే ఋణ మాఫీ గ్రామసభలు సద్వినియోగం చేసుకోవాలని అర్హత ఉండి ఋణం మాఫీ జాబితాలో చోటు దక్కని దరఖాస్తుదారు లును ఏడీఏ రవికుమార్ కోరారు. ఆయన శుక్రవారం నవతెలంగాణ తో మాట్లాడారు. మండలంలో 1611 దరఖాస్తులు ను 18 గ్రామాల్లో పరిశీలించడానికి కార్యాచరణ చేపట్టామని అన్నారు. ఈ 28 నుండి 30 వరకు అశ్వారావుపేట(378) రైతు వేదికలో,31 వ తేదీ శనివారం అచ్యుతాపురం(45),సెప్టెంబర్ 1 న ఆదివారం నారంవారిగూడెం(133) ఆయా జీపీ కార్యాలయాల్లో,ఈ 2 వ తేదీ సోమవారం అనంతారం(27) రైతు వేదికలో,ఆసుపాక(21),బచ్చువారిగూడెం(08), దురద పాడు(09),గాండ్లగూడెం (47),3 వ తేదీ మంగళవారం గుమ్మడి వల్లి(23),జమ్మి\ గూడెం(70),కన్నాయిగూడెం(11),కావడి గుండ్ల(17),నందిపాడు(23) జీపీ కార్యాలయాల్లో,4 వ తేదీ బుధవారం నారాయణపురం(97),5 వ తేదీ గురువారం తిరుమలకుంట(85) రైతు వేదికల్లో,6 వ తేదీ శుక్రవారం ఊట్లపల్లి(52),వినాయక పురం (68) దరఖాస్తులు ను ఆయా జీపీ కార్యాలయాల్లో,7 నుండి 10 తేదీ వరకు ఇతర మండలాల దరఖాస్తులు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.