– గుత్తేదారు, ఆర్అండ్ బి అధికారులు కుమ్మక్కు.
– ఇబ్బందుల్లో ప్రయాణికులు
– జెన్కో నిదులు రూ.కోటి లూటీ.
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని నాగులమ్మ దేవాలయం నుంచి తాడిచెర్ల వరకు ప్రధాన రోడ్డు ప్యాచ్ వర్క్ పనుల్లో నాణ్యత నవ్వులపాలైయింది..పగుళ్లు పడిన రహదారి నిర్మాణానికి తాడిచర్ల ఉపరితల గని (సిఎస్సార్) సీనరేజ్ ఫండ్ కింద టీఎస్ జెన్కో అధి కారులు రూ.కోటి నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ నిధులను ఆర్ అండ్ బీ శాఖకు మళ్లించి ఓ కాంట్రాక్టర్ తో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు చేయించారు. కానీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. కాగా రూ.కోటి మంజూరైన నిధులను ఆర్ అండ్ బీ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కై మల్లారం ఆదేవాగు బ్రిడ్జి నుంచి మూడున్నర కిలోమీటర్ల వరకే ఈ పనులు చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1 భూపాలపల్లి కెటిపి చెల్పూర్ కు తరలించే బొగ్గు లారీల రవాణాతో పగుళ్లు పడిన ప్రధాన రహదారి బిట్ రోడ్డు పూర్తిగా భారీ గుంతలు యధాతధంగా కనిపిస్తున్నాయి.రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో ప్యాచ్ వర్క్ చేసిన ఎక్కడి గుంతలు అక్కడే దర్శనమిస్తున్నాయి.పనులు సాధారణంగా జరిగాయా.?నిబంధనలకు విరుద్ధంగా జరిగాయా.? అధికారులు పర్యవేక్షణ చేశారా..లేదా గుత్తేదారు ఇచ్చే మామూళ్లకు తలొగ్గారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నాణ్యత నవ్వులపాలు..
మండలంలోని నాగులమ్మ దేవాలయం నుంచి తాడిచెర్ల వరకు పగుళ్లు పడిన రహదారి నిర్మాణానికి తాడిచర్ల ఉపరితల గని సీనరాజ్ ఫండ్ కింద టీఎస్ జెన్నో అధికారులు రూ.కోటి నిధులను మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఆ నిధులను ఆర్ అండ్ బీ శాఖకు మళ్లించి కాంట్రాక్టర్తో రోడ్డు స్కాచ్ స పనులు చేయించారు. కానీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనుల్లో నాణ్యత ప్రశ్నార్ధకంగా కేనిపిస్తోంది. కాగా రూ. కోటి మంజూరైన నిధులను ఆర్ అండ్ బీ శాఖ అధికా రులు కాంట్రాక్టర్ కుమ్మక్కై మల్లారం ఆరేవాగు బ్రిడ్జి నుంచి మూడున్నర కిలోమీటర్ల వరకే ఈ పనులు నిర్వహించారు. తాడిచర్ల ఓసీపీ బ్లాక్-1 పిఎమ్యాడ్ ప్రాజెక్టు నుంచి భూపాలపల్లి వెల్పూర్ కేటీపీపీకి తరలించే బొగ్గు టిప్పర్ల రవాణాతో పగుళ్లు బడిన ప్రధాన రహదారి బీటీ రోడ్డు పూడ్చిన గుంతలు యధాతథంగానే కనిపిస్తున్నాయి. గుంతలు పడిన రోడ్డును ప్యాచ్ వర్క్ కిండ నిర్మించిన రోడ్డుపై ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నాయి.మల్లారం తాడిచర్ల రోడ్డుపై ఏర్పడిన పగుళ్లు గుంతలు అక్కడే దర్శనమివ్వడం విస్మయం కలిగి స్తోంది. పనులు నాణ్యంగా జరిగాయా. ? నిబంధనల ప్రకారం పనులు చేశారా అని అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతు న్నాయి.నాలుగు నెలల కింద రహదారి పగుళ్లను పూడ్చే పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా చేయడంతో కనీసం నాలుగు నెలలు గడవక ముందే పలుచోట్ల మళ్లీ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో బీటీ రోడ్డుపై వాహనదారులు పడుతున్న ఇక్కట్లు వర్జాతీతంగా మారాయి..
పర్యవేక్షణ కరువు..
ఆర్అండ్ బి అధికారుల పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుస్ధితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.గుంతలు పడిన ప్రదేశంలో మూడు లేయర్ల తారుపూత వేయాల్సి ఉండగా సగం వరకు వేసి మిగతా సగం వేయకుల దానే కాంట్రాక్టర్ చేతులెత్తేశారని మల్లారం గ్రామస్తులు వాపోతున్నారు.తాడిచెర్ల నుంచి నాగులమ్మ వరకు ప్రధాన దహదాద్ బీటీ రోడ్డు ప్కార్ వర్క్ పనులకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మురుకర్ హయాంలో రూ.2కోట్లు మంజూరు. చేయాలని జెన్నో అధికారులకు సూచించారు. అయితే మల్లారం ఆదేవాగనుంచి గాడిచెర్ల ఎంపీడీఓ కార్యాలయం వరకు రూ.1కోటి నిధులను మంజూరు చేశారు. మల్లారం అదెవాగు బ్రిడ్జి నుంచి తాడిచర్ల ఎంపీడీవో కార్యాలయం వరకు 5 కిలోమీటర్లు ఉన్న రోడ్డును దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల వరకు చేపట్టిన పనుల్లో నాణ్యత పాటించలేదని తెలుస్తోంది. రూ.కోటి నిధుల్లో నుంచి రూ.79లక్షల నిధులు కాంట్రాక్ట్ చేసిన పనులలో ఖర్చయినట్లు ఆర్ అండ్ శాఖ అధికారులు చూపించడం విస్మయం కలిగి స్తోంది.టీఎస్ జెన్కో అధికారులు రోడ్డు ప్యాచ్ వర్క్ పనుల నిర్మాణానికి ఇచ్చిన రూ. కోటి నిధులతో కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు కుమ్మల్మై అంతంత మాత్రంగా పనులు చేసి అరకోటి విధులను లూటీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.