గిరాయికుంటను కె.ఎల్.ఐ నీటితో నింపుతాం: ఎమ్మెల్యే

We will fill the mill with KLI water: MLA– ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం
నవతెలంగాణ – అచ్చంపేట
మండల పరిధిలోని పుల్జాల కేఎల్ఐ కాల్వ నుండి లిఫ్ట్ ద్వారా గిరాయి కుంటకు నీటిని తరలించడానికి పులిజాల గ్రామంలో కేఎల్ఐ కాల్వ వద్ద శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శంకుస్థాపన చేశారు. రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఆయకట్టు ద్వారా 100 ఎకరాలకు సాగునీరు అందడం జరుగుతుందని, నల్లమల్ల ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం కొనసాగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి,  స్థానిక నాయకులు ,రైతులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.