మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా మున్వార్ అలీ

Munwar Ali as the new Commissioner of Municipalityనవతెలంగాణ – చండూరు 
చండూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్ గా యం.డి. మున్వార్ అలీ శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన వెంకట మణికరణ్  దీర్ఘ కాలిక సెలవులో వెళ్లారు. నూతన కమిషనర్ హాలియా మున్సిపాలిటీ నుండి బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు అందుబాటులో వుంటూ సమస్యల పరిష్కారానికి తన వంతుగా   కృషి చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు , పార్టీ నేతలు మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలన్నారు.