మెడికల్ అధికారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ 

Health Camp under Medical Officerనవతెలంగాణ –  కామారెడ్డి
సిజరల్ వ్యాధులు వస్తుండడంతో కామారెడ్డి మండల పరిదిలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో పి హెచ్ సి దేవునిపల్లి మెడికల్ అధికారి డా. జోహ ముజీబ్, డా.దివ్వ ఆద్వర్యంలో హేల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపుకు గ్రామంలోని వృద్ధులు, మహిళలు వచ్చి డాక్టరుల వద్ద ఆరోగ్యపరిక్షలు చేసుకొని డాక్టరులు  సూచించిన సలహాలు తీసుకున్నారు. సిజరల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా  ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పి నిరంజన్ మరియు చిన్నమల్లారెడ్డి ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.