జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మినీ జాబ్ మేళా విజయవంతంగా పూర్తయింది. ఈ జాబ్ మేళలో మూడు ప్రముఖ కంపెనీలు హాజరు కాగా మొత్తం 35 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వీరిలో 16 మంది ప్రాథమిక ఎంపిక కాగా సన్ సాయ్, వెస్టీజ్ సంస్థలలో మొత్తం 14 మంది ఉద్యోగం సాదించారు. ఉద్యోగం పొందిన వారికి ఉపాధి కల్పన కార్యలయం, జూనియర్. ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సామ మాధవరెడ్డి నియామక పత్రాలను అందజేసారు.