బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌

నాని, దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కలయికలో రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్ట్‌ 29న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో హీరో నాని మాట్లాడుతూ,’రిలీజ్‌ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రసంశలు వస్తున్నాయి. ఇంత వర్షంలో కూడా అన్నీ చోట్ల హౌస్‌ ఫుల్స్‌ అవుతున్నాయంటే ఇలాంటి మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలోనే ఎక్కడా ఉండరు. ఇది కేవలం వీకెండ్‌ ఫిల్మ్‌ కాదు లాంగ్‌ రన్‌ వుండబోతోంది. ఇది చాలా స్పెషల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే మూీ. ఈ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులతో పాటు చూస్తున్నప్పుడు వాళ్ళ ఎనర్జీని మేం తక్కువ అంచనా వేశామనిపించింది. ప్రతి సీన్‌ని బాగా ఎంజారు చేస్తున్నారు’ అని అన్నారు.
‘ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌, సక్సెస్‌కి చాలా థాంక్స్‌. చారు మీ మనసులో నిలిచిపోతుంది. ఇది నా ఫేవరేట్‌ క్యారెక్టర్‌. 100 డేస్‌ సక్సెస్‌ కూడా ఇలాగే సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అని హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ చెప్పారు. డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ మాట్లాడుతూ,’నామీద నాకున్న నమ్మకం కంటే నామీద నానికి ఉన్న నమ్మకం ఎక్కువ. అందుకే ఇలాంటి మంచి సినిమా రాగలిగింది. ఇప్పటివరకూ కొంచెం సాఫ్ట్‌ రోమ్‌ కామ్‌ సినిమాలే చేశాను. ఇలాంటి స్కేల్‌ ఉన్న సినిమాని హ్యాండిల్‌ చేయగలని నమ్మిన నిర్మాత దానయ్యకి థ్యాంక్స్‌. కళ్యాణ్‌ ఫస్ట్‌ సినిమాతోనే ఇంత పెద్ద సక్సెస్‌ కొట్టినందుకు ఆనందంగా ఉంది. ఈ సక్సెస్‌ టీమ్‌ ఎఫర్ట్‌. ఇంత అద్భుతమైన సక్సెస్‌ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని తెలిపారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ,”ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందని ప్రీ రిలీజ్‌లోనే చెప్పాను. చెప్పినట్టే ప్రేక్షకులు హిట్‌ చేశారు. నిన్ను కోరి| తర్వాత మళ్ళీ మాకు రెండో సక్సెస్‌ తీసుకొచ్చిన నానికి థ్యాంక్స్‌’ అని అన్నారు.