– హైజంప్‌లో పూజాసింగ్ జాతీయ రికార్డు
భారత యువ అథ్లెట్ పూజా సింగ్ హైజంప్‌లో జాతీయ రికార్డు తిరగరాసింది. 17 ఏండ్ల పూజ 1.83 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో పూజ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును(1.82 మీటర్లు) బద్దలు కొట్టింది. హరియాణాకు చెందిన తాపీ మేస్త్రీ కూతురైన పూజ క్వాలిఫయింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. సరైన సౌకర్యాలు లేకుండానే అండర్-14 స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణం నెగ్గిన పూజ 2022 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అండర్-16, అండర్-18 పోటీల్లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది.
యూజియా ఫార్మాకు ఫార్మెక్సిల్ పలాటినం స్టార్ అవార్డు
అరంబిందో ఫార్మాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అరంబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్పిషాలిటీస్ 2022-23లో ఫార్మ ఎగుమతులకు సంబంధించి ఫార్మెక్సిల్ ప్లాటినం స్టార్ అవార్డు అందుకుంది. ఫార్మా ఎగుమతుల్లో కీలకపాత్ర పోషించినందుకు గాను నోయిడాలో జరిగిన కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. కంపెనీ సీఈవో పువ్వల యుగంధర్, అసోసియేట్ ప్రెసిడెంట్ విజరు నటరాజన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితన్ ప్రసాద్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
జయశంకర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ జయశంకర్‌కు రేర్ ఎర్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ లైఫ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు… రేర్ ఎర్త్ పరిశోధన, అభివృద్ధి, అనువర్తనాల రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఇవ్వబడింది. కేరళలోని తిరువనంతపురంలో ఆగస్టు 22వ తేదీన అంతర్జాతీయ సదస్సులో ఆయనకు ఆవార్డును అందజేశారు.
అత్యంత సంపన్నుల జాబితాలో అంబానీని మళ్లీ దాటేసిన అదానీ
పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (62) భారతదేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. మరోసారి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని(67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95శాతం ఎగిసి రూ.11.6 లక్షల కోట్లకు చేరింది. హురుక్ ఆగస్టు 29వ తేదీ విడుదల చేసిన సంపన్నుల జాబితా-2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు పడిపోయింది. అప్పుడు అంబానీ సంపద రూ.8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ.10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ.1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 64 శాతం వృద్ధి రూ.159 లక్షల కోట్లకు చేరింది.