గంజాయి, గందరగోళం అనేవి ఏ భాషాపదాలు..?

1. గ్రాము/గ్రహము, మోము/మొగము, దాకా/తనుక లాంటి పదాల్లో జరిగిన పరిణామం…
ఎ.వర్ణవ్యత్యయం బి.తాలవ్యీకరణం
సి.లోపదీర్ఘత డి.స్వరభక్తి
2. పగలు/పవలు, నివురు/నిమురు, తెలుగు/తెనుగు, తీగ/తీగ, అదరిపడు/అదిరిపడు… లాంటి పదాల్లోని ధ్వని మార్పులు..?
ఎ. వర్ణసమీకరణం బి. వర్ణవ్యత్యయం
సి. వర్ణవినిమయం డి. విప్రకర్ష
3. ఆసర, గందరగోళం, కొరడ, గంజాయి, చవక, కిచిడి… లాంటి పదాలకు మూలం?
ఎ.ఒరియా బి. తమిళం సి.కన్నడం డి.మరాఠీ
4. మనకు లభిస్తున్న మొదటి లిఖితపదం ‘నాగబు’
ఎ. తత్సమం బి.తద్భవం
సి.దేశ్యం డి.అన్యదేశ్యం
5. ‘వంద మంది కార్మికులు’ ఇందులో అర్ధశూన్యపదాంశం?
ఎ.వంద బి.మంది సి.కార్మికులు డి.వందమంది
6. ఆగమ పదాంశాన్ని గుర్తించండి?
ఎ.బొమ్మలు, గాలివాన బి.సీతాకోకచిలుక, నాగమల్లి
సి.కులీనస్త్రీ, నందివర్ధనం డి.ఇంటికి, మంటికి
7. జతపర్చుము
1.శత్రర్థకం అ.వెళ్ళినా, అడిగినా
2.చేదర్థకం ఆ.వెళ్ళి, అడిగి
3.క్త్వార్థకం ఇ.వెళ్ళితే, అడిగితే
4.అప్యర్థకం ఈ.వెళ్తూ, అడుగుతూ
1 2 3 4
ఎ. ఇ ఈ ఆ అ
బి. అ ఇ ఆ ఈ
సి. ఈ ఆ అ ఇ
డి. ఈ ఇ ఆ అ
8. ‘ఆమె నోటితో మాట్లాడి, నొసలుతో వెక్కిరిస్తుంది’ వాక్యంలో ‘తో’ విభక్తి ప్రత్యయం ఇలా ప్రయుక్తమయ్యింది?
ఎ.రీత్యర్థంలో బి.సహార్థంలో
సి.కరణార్థంలో డి.కాలార్థంలో
9. ‘కుందేటి కొమ్ము’ – పదబంధంలోని విభక్తి ప్రత్యయం?
ఎ. అనౌప విభక్తి ప్రత్యయం బి.ఔప విభక్తి ప్రత్యయం
సి.ప్రథమ విభక్తి ప్రత్యయం డి.ఏదీలేదు
10. సంశ్లిష్టకావ్యంలో…
ఎ. రెండు క్రియరహిత వాక్యాలుండొచ్చు
బి. రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రధాన వాక్యాలుండొచ్చు
సి. రెండు సమాపక క్రియలుండొచ్చు
డి. రెండు అసమాపక క్రియలుండొచ్చు
11. క్రింది వానిలో సరియైనది?
ఎ. సామాన్య వాక్యాల్లో ఒకే ఆఖ్యాతం ఉంటుంది.
బి. ఏక పదార్థ బోధకాలైన రెండు నామాలను ఒక చోట చేరిస్తే క్రియరహిత వాక్యాలు ఏర్పడతాయి.
సి. క్రియరహిత వాక్యాల్లోని రెండు నామాల్లో మొదటిది ఉద్దేశ్యం, రెండోది విధేయం
డి. పైవన్నీ
12. సరియైన నామ్నీకరణ వాక్యాన్ని గుర్తించండి?
ఎ. ఆ అబ్బాయి ఊరికి వెళ్ళాడు – ఊరికి వెళ్ళిన అబ్బాయి
బి. వాడు సువర్ణతో వచ్చాడు – వాడు వచ్చిన సువర్ణ్ణ
సి. వాడు వాళ్ళలో మంచివాడు – వాడు మంచి వాడయిన వాళ్ళు
డి. మాకు 2006లో పెళ్ళయ్యింది – మాకు పెళ్లైన 2006
13. తిక్కన భారతంలో ప్రయోగించబడిన మాండలిక భాషా పదం?
ఎ. మోట బి. కపిల సి. మదుం డి. చిలుకు
14. ఈ క్రింది వానిలో తద్ధిత రూపాలు…?
ఎ. నేర్పరి, టక్కులాడి, ఆటకత్తే
బి. తలపోయు, మేల్కొను, నిలబడు
సి. గంపెడు, దొంగతనం, కుట్రదారు
డి. టపీమని, ఢామ్మని, పరపర ఎ. ఇ.ఈ బి. అ,ఆ సి. అ,ఇ డి. ఆ,ఈ
15. జతపర్చుము
1. పర్యాయపదాలు అ. ప్రతిమాటకు బహుళార్థకత్వం ఉండటం మాట
2. సారూప్యపదాలు ఆ.వాడుొఅతడు/శోషిల్లు, నాడుొ దినం/దేశం
3. నానార్థాలు ఇ. భవం ొ పుట్టుక, బ్రతుకు, ప్రపంచడం
4. అనేకార్థపదాలు ఈ. వ్యవసాయం, సేద్యం, కమతం, సాగు
1 2 3 4
ఎ. ఈ ఆ ఇ అ
బి. ఈ ఇ ఆ అ
సి. ఇ ఈ ఇ అ
డి. ఆ అ ఇ ఈ
16. జతపర్చుము
1. అర్థసౌమ్యత అ. కంపు, కైంకర్యం, ఛాందసుడు
2. అర్థాపకర్ష/అర్థగ్రామ్యత ఆ. సభికులు, ముహూర్తం, వైతాళికులు
3. అర్థవ్యాకోచం ఇ. కోక, ఉద్యోగం, పత్రం, వస్తాదు
4. అర్థసంకోచం ఈ. చెంబు, అవధాని, తైలం
1 2 3 4
ఎ. ఆ ఈ అ ఇ
బి. ఆ అ ఈ ఇ
సి. ఈ ఇ అ ఆ
డి. ఇ అ ఆ ఇ
17. నన్నయ ‘పొంటెన్‌’ అనే ప్రత్యమాన్ని ఏ విభక్తిలో వాడాడు?
ఎ. ద్వితీయ విభక్తి బి. తృతీయ విభక్తి
సి. చరుర్థీ విభక్తి డి. పంచమీ విభక్తి
18. తెలుగు మధ్యద్రావిడ ఉపకుటుంబానికి చెందుతుందని నిరూపించిన భాషావేత్త?
ఎ. బిషప్‌ కాల్ట్‌వెల్‌ బి. బ్లూమ్‌ ఫీల్డు
సి. పి.ఎస్‌.సుబ్రమణ్యం డి. భద్రిరాజు కృష్ణమూర్తి
19. జతపర్చుము
1. వర్గమండలికం అ. పోతుంది, కురుస్తుంది, తెలియదు
2. ప్రాంతీయ మాండలికం ఆ. రోయిణి, సుక్క, బాస, దర్మం
3. జానపద మాండలికం ఇ. దుబ్బనేల, పెండ, బునాది, కర్రు
4. శిష్ట వ్యవహారం ఈ. పాప, యెండి, నేదు, గట్టా
1 2 3 4
ఎ. ఈ ఇ ఆ అ
బి. ఈ ఇ అ ఆ
సి. ఈ ఆ ఇ అ
డి. ఇ ఆ ఈ అ
20. జతపర్చుము
1. అర్థమరిణామం(ూవఎaఅ్‌ఱష జష్ట్రaఅస్త్రవ) అ. జి.ఎన్‌.రెడ్డి
2. ఆధునిక భాష : సంగ్రహ వర్ణనం ఆ. చేకూరి రామారావు
3. ధ్వని పరిణామం ఇ. టోలొమే
4. ప్రాచీనాంధ్ర శాసనాలు ఈ. గంటి జోగి సోమయాజి
1 2 3 4
ఎ. అ ఇ ఆ ఈ
బి. అ ఆ ఇ ఈ
సి. ఈ ఇ ఆ అ
డి. ఈ ఆ ఇ అ
21. జతపర్చుము
1. అమరసింహుడు అ. త్రిలింగ లక్షణశేషం
2. ఆచార్య జి.ఎన్‌.రెడ్డి ఆ. తెలుగు వ్యాకరణం
3. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇ. నామలింగాను శాసనం
4. రావిపాటి గురుమూర్తిశాస్త్రి ఈ. తెలుగు పర్యాయ పద నిఘంటువు
1 2 3 4
ఎ. ఆ ఇ అ ఈ
బి. ఆ ఈ అ ఇ
సి. ఇ ఈ అ ఆ
డి. ఇ అ ఈ ఆ
22. గ్రిమర్సన్‌ రాసిన ‘లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’లో పేర్కొన్న మాండలికాలు ఎన్ని?
ఎ. 250 బి. 300 సి. 644 డి. 544
23. ‘కైఫియత్తు’ అనునది ఏ భాషా పదం?
ఎ. హిందుస్థాని బి. తెలుగు సి.మరాఠి డి.పోర్చుగీసు
24. ‘తెలంగాణ’ ప్రాంతం ఏ మండలానికి చెందుతుంది?
ఎ. దక్షిణ మండలం బి. ఉత్తర మండలం
సి. మధ్య మండలం డి. పర్వ మండలం
25. ఆధునిక భాషాశాస్త్రవేత్తల దృష్టిలో సాధు(ర), శకట (ఱ) రేఫలు?
ఎ. సవర్ణాలు బి. సపదాంశాలు
సి. మూర్ధన్యాలు డి. ద్విత్వవర్ణాలు
26. ద్రావిడ భాషల్లో తాలవ్యీకరణం చెందని భాష?
ఎ. తమిళం బి. తెలుగు సి. కన్నడం డి. మలయాళం
27. ‘తహశీల్దారు’ ఏ భాషాపదం?
ఎ. పోర్చుగీసు బి. ఉర్ధూ
సి. డచ్చీ డి. ఇంగ్లీష్‌
సమాధానాలు
1. సి 2. సి 3. డి 4. ఎ 5. బి
6. ఎ 7. డి 8. సి 9. బి 10. డి
11. డి 12.ఎ 13.బి 14.సి 15. ఎ
16. బి 17. సి 18. డి 19. ఎ 20. బి
21. సి 22. డి 23. ఎ 24. బి 25. ఎ
26. సి 27. బి
నానాపురం నర్సింహులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా.
9030057994
నెట్‌ / సెట్‌ ప్రత్యేకం