కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవ తెలంగాణ- భగత్ నగర్ :
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.భారీ వర్షాలకు సంబంధించి బాధితులు కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నెంబర్.+91 878 299 7247 తో బాటు వాట్సాప్ నెంబర్ ను 81251 84683 లో సంప్రదించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్ లో సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ ఒక ప్రకటన లో తెలిపారు