వర్షాల్లో బయటకు వెళ్లొద్దు

– మాజీ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఎవరూ బయటకు వెళ్లొద్దని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్‌) విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదివారంనాడొక ప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక నిర్మాణాలు, పాడుబడిన భవనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి, సహాయచర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.