హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావుకు స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ ప్రతి ఏడాది క్రీడారంగంలోని ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేసి, సన్మానిస్తుంది. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ ఏడాదికి గాను ఉత్తమ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా జగన్‌మోహన్‌రావుకు స్పోర్ట్స్ ఇండియా ఫౌండేషన్ పురస్కారం ప్రదానం చేసింది. హ్యాండ్‌బాల్, క్రికెట్‌తో పాటు వివిధ క్రీడాంశాలకు చెందిన క్రీడాకారులకు జగన్‌మోహన్ రావు వ్యక్తితగతంగా అందిస్తున్న ప్రోత్సాహం, క్రీడా రంగ అభివద్ధికి ఆయన అందిస్తున్న సహకారాన్ని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేశారు.