
నవతెలంగాణ-బెజ్జంకి
బడుగు బలహీన వర్గాల ప్రజలకు రూ.2 కిలోల బియ్యం,విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, మహిళ స్వసక్తి సంఘాలకు పావలా వడ్డి రుణాలు, ఆరోగ్య శ్రీ పథకంతో పాటు 108,104 ఉచిత వైద్య సేవలు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజల సంక్షేమాని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని మండల కాంగ్రెస్ నాయకులు కొనియాడారు.సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అ్వర్యంలో దివంగత మాజి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, అనుబంధ కమిటీల నాయకులు,కార్యకర్తలు హజరయ్యారు.