
నవతెలంగాణ-పెద్దకోడప్ గల్
మండలంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని బేగంపూర్ గ్రామ సివారులో మొక్క జొన్న పంట నెలమట్టం అయింది. పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందిఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.రైతులు అప్పొ సప్పొ చేసి పంట పండిస్తే చేతికి వచ్చేసమయంలో తమకు నష్టాలు మిగిలి అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుఅధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.