నవతెలంగాణ – శంకరపట్నం
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపుమేరకు సోమవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వివాదాస్పదమైన ఆర్డర్లను రద్దు చేస్తూ, కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీని కొనసాగించాలన్నారు. అర్టిజెన్ల డిమాండ్స్ కన్వర్షన్స్, ఏపీ ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గుల్లి రవి,జాయింట్ సెక్రెటరీ బుక్య రమేష్ నాయక్, ఏ ఎల్ ఎం లు ఆది బాబు, జూల రమేష్, జేఎల్ఎం సురేష్ పాల్గొన్నారు.